సౌదీలో విదేశీ న్యాయ సంస్థలకు కొత్త లైసెన్స్ నిబంధనలు
- August 27, 2022
సౌదీ: విదేశీ న్యాయ సంస్థలకు లైసెన్సుల అమలు నిబంధనలను సౌదీ న్యాయ శాఖ మంత్రి వాలిద్ అల్-సమానీ గురువారం నాడు ఆమోదించారు.న్యాయ అభ్యాసాన్ని అభివృద్ధి చేయడం, న్యాయవాదులకు అధికారం కల్పించడం, రాజ్యంలో వ్యాపార వాతావరణాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలు తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.తాజా నిబంధనలలో లైసెన్సింగ్, వాటి పరిధి, విదేశీ న్యాయ సంస్థల విధులు, తాత్కాలిక లైసెన్స్‌ల అవసరాలు, విదేశీ న్యాయ సలహాదారులను నియమించే విధానాలు ఉన్నాయన్నారు. స్థానిక న్యాయ నిపుణులతో జ్ఞానాన్ని పంచుకోవడం, శిక్షణ - అభివృద్ధి, విదేశీ వ్యాపారాలు, పెట్టుబడిదారులకు అవకాశాలు సృష్టించడంపై కొత్త నిబంధనలు దృష్టి సారిస్తాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







