పాటకు పట్టాభిషేకం

- April 15, 2016 , by Maagulf
పాటకు పట్టాభిషేకం

అభిమానులు అందరికీ ఉంటారు. కాని అభిమాన సంఘాలు నటీ నటులకు మాత్రమే వుంటాయి. మిగిలిన శాఖల వారికి ఉండడం అరుదు .  ఇక పాటల రచయితల విషయానికొస్తే అలా అభిమాన సంఘాలు వుండడం అతి ఆశ్చర్యం గా అనిపిస్తుంది. అటువంటి అరుదైన సంఘటన ఒకటి ఇటీవల వెలుగులోకొచ్చింది.

ప్రముఖ సినీ గీత రచయిత చంద్రబోస్ రెండు అభిమాన సంఘాలు వున్నాయి. అందులో ఒక అభిమాన సంఘం వారు శ్రీరామ నవమికి భద్రాచలం కి వచ్చే భక్తులకి ఉచితం గా పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. ఇది కాక గుంటూరు లోని వినుకొండ దగ్గర రావ్వారం లో నాయుడు అనే ఓ రైతు చంద్రబోస్ సేవా సమితి అని ఓ అభిమాన సంఘాన్ని పెట్టి వీలైనంతలో అందరికి తనకు తోచిన సాయం చేస్తూ  వుంటాడు. ఏది ఏమైనా ఒక సినీ గీత రచయిత పేరిట కొన్ని మంచి సామాజిక కార్యక్రమాలు జరగడం హర్షించ దగ్గ పరిణామం . ఒక విధంగా పాటకు పట్టాభిషేకం.

- రాజా (మ్యూజికాలజిస్ట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com