మహేష్ కోసం ‘గెస్ట్’ అవతారమెత్తబోతున్న లవర్ బోయ్.!

- August 29, 2022 , by Maagulf
మహేష్ కోసం ‘గెస్ట్’ అవతారమెత్తబోతున్న లవర్ బోయ్.!

చైల్డ్ ఆర్టిస్టుగా ఒకప్పుడు తరుణ్ తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందాడు. ‘నువ్వే కావాలి’ సినిమాతో హీరోగా సెన్సేషనల్ విజయం అందుకున్నాడు. అప్పట్లో రికార్డులు కొల్లగొట్టింది ఈ సినిమా. 

ఆ పాపులారిటీని కొంత కాలం కొనసాగించాడు హీరోగా తరుణ్. అయితే, ఆ తర్వాత తరుణ్ గ్రాఫ్ మెల్ల మెల్లగా పడిపోతూ వచ్చింది. ఒకానొక టైమ్‌లో పూర్తిగా కెరీర్ కుదేలైపోయింది. దాంతో సినిమాలకు దూరమైపోయాడు తరుణ్.

లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ తరుణ్ సినిమాల్లో నటించబోతున్నాడట. అది కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో. హీరోగా తరుణ్ నటించిన తొలి సినిమా ‘నువ్వే కావాలి’కి త్రివిక్రమ్ మాటల రచయితగా వున్నారు. త్రివిక్రముడి మాటలే ఆ సినిమాని అంత పెద్ద హిట్ చేయడానికి కారణం అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు.

ఆ తర్వాత ‘నువ్వే నువ్వే’ సినిమా కోసం త్రివిక్రమ్‌తో కలిసి పని చేశాడు తరుణ్. ఆ సినిమా కూడా పెద్ద హిట్. ఇక, ఇప్పుడు మళ్లీ త్రివిక్రమ్ సినిమాతోనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాడన్నమాట తరుణ్.

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమాలో తరుణ్ కోసం ఓ ఇంపార్టెంట్ గెస్ట్ రోల్‌ని క్రియేట్ చేశాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. సినిమాకి ఈ పాత్ర చాలా కీలకంగా వుండబోతోందట. చూడాలి మరి, తరుణ్ కెరీర్‌కి ఈ సినిమా ఎలా యూజ్ అవ్వనుందో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com