స్టార్ హీరోల ‘బుల్లి’ ఫైట్: ప్రభంజనం సృష్టిస్తారా.?

- August 29, 2022 , by Maagulf
స్టార్ హీరోల ‘బుల్లి’ ఫైట్: ప్రభంజనం సృష్టిస్తారా.?

పెద్ద తెరపై బాలయ్య, నాగార్జునలు స్టార్ హీరోలన్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద తలపడి ఈ స్టార్స్ వసూళ్లు కొల్లగొట్టిన సందర్భాలు అనేకం వున్నాయ్. అయితే, ఈ ఇద్దరు స్టార్ట్ ఇప్పుడు బుల్లితెరపై తలపడనున్నారు. 

అదేనండీ, హోస్టులుగా. బిగ్‌బాస్ సీజన్ 6తో నాగార్జున త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 4 నుంచి బిగ్‌బాస్ ఆరో సీజన్ మొదలు కానుంది. 

అలాగే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా బాలయ్య బాబు కూడా హోస్ట్‌గా తనలోని డిఫరెంట్ యాంగిల్‌ని బయటకి తీశారు అన్‌స్టాపబుల్ అనే రియాల్టీ షోతో. ఓటీటీ ఆహా వేదికగా మొదటి సీజన్ అన్ స్టాపబుల్‌ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన బాలయ్య రెండో సీజన్ కోసం సంసిద్ధమవుతున్నారట.

బహుశా రెండో సీజన్ అన్‌స్టాపబుల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న విషయంపై పక్కా క్లారిటీ లేదు. కానీ, సెప్టెంబర్ చివరి వారంలో స్టార్ట్ అవ్వొచ్చునని అంటున్నారు. ఈ లోపు బాలయ్య, గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్‌ని పూర్తి చేసి, గుమ్మడికాయ కొట్టేయనున్నారట. అలాగే, నాగార్జున కూడా ‘ది ఘోస్ట్’ సినిమాని పూర్తి చేసే పనిలో బిజీగా వున్నారు. 

మొత్తానికి అటు నాగార్జున, ఇటు బాలయ్య ఇద్దరూ ఓ వైపు సినిమాలతోనూ మరోవైపు రియాల్టీ షోలతోనూ బిజీగా వున్నారన్న మాట. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com