‘ఆంటీ’ అంటూ ట్రోలింగ్.! సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనసూయ.!

- August 30, 2022 , by Maagulf
‘ఆంటీ’ అంటూ ట్రోలింగ్.! సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనసూయ.!

విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ సినిమా డిజాస్టర్ టాక్ సందర్భంగా విజయ్ దేవరకొండకు ఇలా జరగాల్సిందే.. అనే వుద్దేశ్యంతో అనసూయ భరద్వాజ్ చేసిన ట్వీట్లు నెట్టింట వైరల్ అయ్యాయ్. ‘అమ్మని తిట్టిన ఉసురు తగలకుండా వుండదు.. కర్మ కొన్ని సార్లు రావడం లేటవుతుందేమో. కానీ, రావడం మాత్రం పక్కా..’ అంటూ అనసూయ వేసిన ట్వీట్లు విజయ్ దేవరకొండను వుద్దేశించి చేసినవే అంటూ ఆయన ఫ్యాన్స్ అనసూయని దారుణంగా ట్రోల్ చేశారు.

ఈ నేపథ్యంలోనే అనసూయను ‘ఆంటీ’ అంటూ సంబోధిస్తూ, ఆ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేశారు. దాన్ని ఖండిస్తూ అనసూయ నెటిజన్లపై విరుచుకు పడింది. అయినా నెటిజన్లు ఆగకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించింది. 

హెచ్చరించినట్లుగానే తాజాగా అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
సోషల్ మీడియా దుర్వినియోగాన్ని ఆపాలన్న వుద్దేశ్యంతోనే ఈ ఫిర్యాదు చేస్తున్నాననీ, కుర్రోళ్ల భవిష్యత్తు పాడయిపోతుందనే మంచి ఆలోచనతో ఇంతవరకూ ఆగాననీ, ఇకపై భరించడం తన వల్ల కాదంటూ, ఇలాంటి నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందనీ, తనను ఎవరైతే ట్రోల్ చేశారో వారిని ప్రస్థావిస్తూ సవివరంగా ఫిర్యాదులో పేర్కొంది అనసూయ.

తన ఫిర్యాదును అధికారులు చాల బాగా రిసీవ్ చేసుకున్నారనీ, తగు విధమైన చర్యలు తీసుకుంటామనీ హామీ ఇచ్చారనీ అనసూయ తెలిపింది. ఇక చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. ఇకనైనా ఇలాంటి సైబర్ కేటుగాళ్ల ఆటలకు చెక్ పడుతుందని ఆశిస్తున్నానని అనసూయ అభిప్రాయ పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com