ఉద్యోగుల సెకండ్‌మెంట్ అభ్యర్థనలకు ఇ-సర్వీసులు ప్రారంభం

- September 01, 2022 , by Maagulf
ఉద్యోగుల సెకండ్‌మెంట్ అభ్యర్థనలకు ఇ-సర్వీసులు ప్రారంభం

ఖతార్: ఉద్యోగుల సెకండ్‌మెంట్ అభ్యర్థనల కోసం కొత్త ఇ-సేవను ప్రారంభించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ (MOL) ప్రకటించింది. ఈ సేవ ప్రక్రియలను వేగవంతం చేయడం, లావాదేవీలను పారదర్శకంగా పూర్తి చేయడానికి డిజిటల్ పరివర్తన వ్యూహంలో భాగంగా ఈ సర్వీసును ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త సేవ ప్రస్తుత యజమానిని మార్చాల్సిన అవసరం లేకుండా మరొక కంపెనీ లేదా సంస్థకు కార్మికుల సెకండ్‌మెంట్ కోసం అభ్యర్థనలను సమర్పించడానికి కూడా అనుమతిస్తుందని పేర్కొంది. అప్లికేషన్ ఆమోదం పొందిన తరువాత  ఉద్యోగులు కొత్త కంపెనీలో పూర్తి సమయం లేదా పార్ట్ టైమ్ పని చేసుకోవచ్చు.ఈ సేవ ప్రస్తుత యజమాని ఆమోదానికి లోబడి ఉంటుందని, వర్కర్ సెకండ్ చేయబడిన కంపెనీ కూడా పూర్తిగా రిజిస్టర్ చేయబడి ఉండాలని, 2004 నాటి లేబర్ లా నం. 14 నిబంధనలకు అనుగుణంగా ఆమోదించబడాలని  మంత్రిత్వ శాఖ పేర్కొంది. సెకండ్‌మెంట్ వ్యవధి గరిష్టంగా ఆరు నెలలు మించకూడదని, అలాగే ఉద్యోగి నివాస అనుమతి గడువు తేదీని కూడా మించకూడదని వెల్లడించింది. ప్రైవేట్ సంస్థలు, కంపెనీలు, ప్రజలు https://www.mol.gov.qa/ar/pages/default.aspx  వెబ్‌సైట్ ద్వారా కార్మిక మంత్రిత్వ శాఖ సేవలను పొందవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com