ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కు అసోం ఆర్.టీ.సీ నుంచి ఆర్డ‌ర్

- September 02, 2022 , by Maagulf
ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కు అసోం  ఆర్.టీ.సీ నుంచి ఆర్డ‌ర్

హైద‌రాబాద్: అసోం రోడ్డు ర‌వాణా సంస్థ నుంచి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కు 100 ఎల‌క్ట్రిక్ బ‌స్సుల కోసం లెటర్ ఆఫ్ అవార్డ్ అందుకుంది.ఈశాన్య రాష్ట్రాల నుంచి కంపెనీకి ఇదే తొలి ఆర్డ‌ర్.ఔట్ రైట్ కొనుగోలు ప్రాతిప‌దిక‌న ఈ ఆర్డ‌ర్ ల‌భించింది.వ‌చ్చే 9 నెల‌ల్లో బ‌స్సుల‌ను కంపెనీ డెలివ‌రీ చేయ‌నుంది. అలాగే, ఐదేండ్ల పాటు బ‌స్సుల మెయింటెన్స్ కూడా ఒలెక్ట్రానే చేయ‌నుంది. ఈ వంద బస్సుల ఆర్డ‌ర్ విలువ రూ.151 కోట్లు. 

ఈ సంద‌ర్బంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఛైర్మ‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ కే. వి. ప్ర‌దీప్ మాట్లాడుతూ, "ఈశాన్య రాష్ట్రా లు, అసోం నుంచి తొలిసారిగా ఆర్డ‌ర్ రావ‌డం సంతోషంగా ఉంది. ఈ ఆర్డ‌ర్ తో దేశం న‌లుమూల‌ల మా బ‌స్సులు న‌డుస్తున్న‌ట్టు అవుతుంది. మా బ‌స్సులు ఇప్ప‌టికే దేశీయ రోడ్ల పై 5 కోట్ల కిలోమీట‌ర్ల‌కు పైగా న‌డిచి కార్బ‌న్ కాలుష్యాల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌గ‌లిగాయి." అని అన్నారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com