గో సంరక్షణ రాయబారిగా కిచ్చా సుదీప్..
- September 03, 2022
బెంగుళూరు: మన దేశంలో ఆవుల్ని దేవతల్లా పూజిస్తాం. ఈ నేపథ్యంలో ఆవుల్ని రక్షించడానికి పలు కార్యక్రమాల్ని కూడా చేపడతారు. గో సంరక్షకుల పేరుతో ఆవుల్ని రక్షించడానికి కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం ముందుంటుంది. అక్కడ గో సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. తాజాగా గో సంరక్షణ రాయబారిగా కన్నడ స్టార్ హీరో సుదీప్‌ను ఎంపిక చేసినట్లు కర్ణాటక పశు సంవర్థక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ తెలిపారు.
పశుపాలనకు, గో సంరక్షణకు ప్రాధాన్యం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన పుణ్యకోటి దత్తు యోజన అనే కార్యక్రమానికి రాయబారిగా సుదీప్ ని ఎంపిక చేశారు. ఈ మేరకు సుదీప్‌కు లేఖ రాసి అభినందనలు తెలిపారు. శుక్రవారం సుదీప్ పుట్టిన రోజు కావడంతో అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వార్తని ప్రకటించారు. గో సంరక్షణ రాయబారిగా సుదీప్ రాకతో ఆ శాఖకు, ప్రభుత్వానికి కూడా సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నారు. గో రక్షకులు, సుదీప్ అభిమానులు ఈ విషయం తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







