‘లైగర్’ ఎఫెక్ట్: ఛార్మీ ఓవరాక్షన్‌కి అలా చెక్ పడిందన్న మాట.!

- September 05, 2022 , by Maagulf
‘లైగర్’ ఎఫెక్ట్: ఛార్మీ ఓవరాక్షన్‌కి అలా చెక్ పడిందన్న మాట.!

‘లైగర్’ సినిమా రిలీజ్‌కి ముందు ఛార్మీ అండ్ టీమ్ చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. ప్రమోషన్ల పేరు చెప్పి దేశం మొత్తం తిరిగేశారు. సరే, సోషల్ మీడియాలో ఛార్మీ చేసిన ఓవరాక్షన్‌కి అయితే అంతే లేదు. 
అదంతా సినిమా రిలీజ్ తర్వాత తీరిపోయిందంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఛార్మీని దారుణంగా ట్రోల్ చేశారు. చేస్తూనే వున్నారు. ఈ టార్చర్ తట్టుకోలేక ఛార్మీ తాజాగా సోషల్ మీడియా అకౌంట్‌కి గుడ్ బై చెప్పేసిందట. 
‘ఛిల్ గయ్స్.. సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నా.. పూరీ కనెక్ట్స్ బ్యానర్ త్వరలోనే బిగ్గర్ అండ్ బెటర్‌గా బౌన్స్ బ్యాక్ అవుతుంది.. అప్పటి వరకూ లివ్ అండ్ లెట్ లివ్..’ అంటూ ఛార్మీ పోస్ట్ చేసింది. 
దాంతో ఇదంతా ‘లైగర్’ ఇచ్చిన షాక్ ట్రీట్‌మెంటే అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏ సోషల్ మీడియా వేదికగా అయితే, రెచ్చిపోయి మరీ సినిమాని ప్రమోట్ చేసిందో, రిజల్ట్ వచ్చాకా, అదే సోషల్ మీడియా దాడి తట్టుకోలేక ఎగ్జిట్ అయిపోయింది ఛార్మీ. అతిగా ఎగిరెగిరి పడితే, ఇలాగే తీరిపోతుంది.. అంటూ సామాన్య నెటిజన్లు సైతం ఛార్మీపై కామెంట్లు షురూ చేశారు.
ఇక పూరీ జగన్నాధ్ అయితే, గతంలోనే సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పేశారు. మళ్లీ ఇంతవరకూ రాలేదు. ఏది ఏమైనా ‘లైగర్’ ఇచ్చిన షాక్ నుంచి ఇప్పుడప్పుడే పూరీ అండ్ ఛార్మీ తేరుకునేలా కనిపించట్లేదు. అంత గట్టిగా కొట్టింది ‘లైగర్’ దెబ్బ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com