ఎన్టీయార్ సినిమాలో ‘రాములమ్మ’ నిజమేనా.?

- September 05, 2022 , by Maagulf
ఎన్టీయార్ సినిమాలో ‘రాములమ్మ’ నిజమేనా.?

సీనియర్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న విజయ శాంతి మరోసారి ముఖానికి రంగు వేసుకోనున్నారట. గత 14 ఏళ్లుగా సినిమాలకు దూరంగా వున్న విజయ శాంతి, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుంది. విజయ శాంతి పవర్ ఫుల్ రోల్ ఈ సినిమాకి అదనపు అస్సెట్ అయిన సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు రాములమ్మని మరో సినిమా కోసం తీసుకురాబోతున్నారట. ఈ సారి యంగ్ టైగర్ ఎన్టీయార్ సినిమా కోసమనీ తెలుస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతోంది. ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువ సుధా ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 
కాగా, ఎన్టీయార్ బర్త్‌డే సందర్భంగా డైలాగ్ మోషనల్ పోస్టర్ తప్ప ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకూ ఎలాంటి అప్‌డేట్ రాలేదు. కానీ, విజయ శాంతి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటించబోతోందంటూ తాజాగా ఓ అప్‌డేట్ హల్‌చల్ చేస్తోంది. అయితే, ఇది అఫీషియల్ ప్రకటన కాదు. జస్ట్ గాసిప్ అంతే. 
మరి, నిజంగానే ఎన్టీయార్ సినిమాలో విజయ శాంతి నటిస్తుందా.? ఒకవేళ నటిస్తే సినిమాకి అదనపు ఆకర్షణ అవుతుందనేది అతిశయోక్తి కాదు. ఈ గాసిప్ నిజమో కాదో తెలియాలంటే, రాములమ్మ కానీ, ఎన్టీయార్ కానీ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం వుంది.
ఇదిలా వుంటే, మరోవైపు ఎన్టీయార్, కొరటాల శివను తాత్కాలికంగా పక్కన పెట్టాడన్న వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయ్. ఏం జరుగుతుందో చూడాలి మరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com