కొణిదెల నిర్మాణ సంస్థపై బురద చల్లే ప్రయత్నం చేస్తేన్నారా.?

- September 06, 2022 , by Maagulf
కొణిదెల నిర్మాణ సంస్థపై బురద చల్లే ప్రయత్నం చేస్తేన్నారా.?

చిరంజీవి 150 వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ తో కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ పుట్టింది. ఈ నిర్మాణంలో వచ్చిన తొలి సినిమాతోనే సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నాడు నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. భారీ లాభాలు తెచ్చిపెట్టింది ఈ సినిమా.
ఆ తర్వాత నుంచీ చిరంజీవి నటిస్తున్న సినిమాల్లో చాలా వరకూ ఈ బ్యానర్ నిర్మాణ భాగస్వామ్యం వహిస్తూ వస్తోంది.అయితే, సినిమా అన్నాకా సక్సెస్, ఫెయిల్యూర్స్ సహజమే. అందుకు కొణిదెల బ్యానర్ కూడా అతీతం కాదు. కానీ, ఇటీవల ఈ బ్యానర్ నుంచి వస్తున్న సినిమాలన్నీ ఫెయిల్యూర్ అవుతున్నాయంటూ ‘ఆచార్య’ సినిమా ఫెయిల్యూర్‌ని ఈ సందర్భానికి ముడి వేస్తూ కొందరు యాంటీ మెగా ఫ్యాన్స్ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.
‘ఆచార్య’ విషయంలో అప్పుడే రామ్ చరణ్, చిరంజీవి క్లారిటీ ఇచ్చేశారు. కేవలం పేరు మాత్రమే మాది. అంతా చూసుకున్నది మాత్రం కొరటాల శివనే అని మొదట్లోనే క్లారిటీ ఇచ్చేశారు. సో ‘ఆచార్య’ ఫెయిల్యూర్‌కీ కొణిదెల బ్యానర్‌కీ ఎలాంటి సంబంధం లేదని అర్ధమైపోయింది.
ఇక ఇదే బ్యానర్‌లో ‘గాడ్ ఫాదర్’ మూవీ వస్తోంది. ఈ సినిమా కూడా ఫెయిల్యూర్ అవుతుందా.? అంటూ నెగటివిటీ ప్రచారం దిశగా కొన్ని కథనాలు పుట్టుకొస్తున్నాయ్. కంటెంట్ వుంటే కటౌట్‌తో పనిలేదు అని గతంలో చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. తాజాగానే అందుకు ప్రధాన సాక్ష్యాలున్నాయ్. 
‘గాడ్ ఫాదర్’ మూవీ ఆల్రెడీ సూపర్ హిట్టు. మలయాళ మూవీ ‘లూసిఫర్’‌కి తెలుగు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. సో, ఈ సినిమా విషయంలో అలాంటి భయాలేం అవసరం లేదంటూ మెగా ఫ్యాన్స్ క్లారిటీ ఇస్తున్నారు. విజయ దశమి సందర్భంగా అక్టోబర్‌లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com