గ్రీన్ టీ పేరిట డ్రగ్స్ సరఫరా.. జంట అరెస్ట్

- September 07, 2022 , by Maagulf
గ్రీన్ టీ పేరిట డ్రగ్స్ సరఫరా.. జంట అరెస్ట్

కువైట్ సిటీ: గ్రీన్ టీ పేరిట డ్రగ్స్ సరఫరాను అధికారులు అడ్డుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఓ జంటను భద్రతాధికారులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  గ్రీన్ టీ పేరిట ఎయిర్‌ఫ్రైట్ ద్వారా ఓ పార్శిల్ వచ్చింది. అనుమానం వచ్చిన అధికారులు దాన్ని తెరిచి చూసి షాక్ అయ్యారు. అందులో దాదాపు 27 కిలోల డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఈ పార్శిల్‌ను తీసుకునేందుకు వచ్చిన ఓ జంటను అధికారులు అరెస్టు చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com