సెంట్రల్ జైలు నుంచి డ్రగ్స్, ఫోన్లు, కత్తులు స్వాధీనం

- September 07, 2022 , by Maagulf
సెంట్రల్ జైలు నుంచి డ్రగ్స్,  ఫోన్లు, కత్తులు స్వాధీనం

కువైట్: ప్రైవేట్ సెక్యూరిటీ సెక్టార్, కరెక్షనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అండర్ సెక్రటరీ పర్యవేక్షణలో సోమవారం సాయంత్రం సెంట్రల్ జైలులో అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా ఖైదీల వార్డుల్లోంచి  డ్రగ్స్, ఆయుధాలు, ఫోన్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు జైలు భద్రతా అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాటిల్లో 6 మొబైల్ ఫోన్‌లు, 4 వైర్డు హెడ్‌ఫోన్‌లు, 2 బ్లూటూత్ హెడ్‌సెట్‌లు, 8 ఛార్జర్లు, డ్రగ్స్, 2 ఫ్లాష్ మెమరీస్, 3 కత్తులు, సర్వీస్ బూస్టర్, హార్డ్ డిస్క్, 2 ఛార్జింగ్ కేబుల్స్, 10 కమ్యూనికేషన్ చిప్‌లు ఉన్నాయని భద్రతా అధికారులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com