దోహాకు మరో విమాన సర్వీస్: ఇండిగో
- September 07, 2022
దోహా: గల్ఫ్ ప్రాంతానికి తమ నెట్ వర్క్ ను బలోపేతం చేయాలని ఇండియన్ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో నిర్ణయించింది. ఇందులో భాగంగా గల్ఫ్ ప్రాంతానికి మరికొన్ని రోజువారీ విమాన సర్వీసులను నడుపనున్నట్లు ప్రకటించింది. దోహా, దుబాయ్, రియాద్‌లకు అదనపు ఫ్రీక్వెన్సీలను ప్రారంభించనున్నట్లు ఇండిగో ప్రకటించింది. అక్టోబర్ 30 నుండి తెలంగాణలోని హైదరాబాద్ నుండి రియాద్, దోహాలకు ప్రతిరోజూ మరో విమాన సర్వీసును నడుపనుంది. అలాగే కర్ణాటకలోని మంగళూరు నుండి దుబాయ్‌కి అక్టోబర్ 31 నుండి మరో విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఈ కొత్త సర్వీసుతో కలిపి హైదరాబాద్ నుండి దోహాకు మొత్తం సర్వీసుల సంఖ్య మూడుకు చేరుకోనుంది. ఇప్పటికే రియాద్-హైదరాబాద్ మధ్య వారానికి రెండుసార్లు ఇండిగో సర్వీసులు నడుస్తుండగా... ఇకపై సోమ, శనివారాల్లో సౌదీ రాజధాని నుండి.. ఆది, శుక్రవారాల్లో హైదరాబాద్ నుండి దుబాయ్‌కి అదనపు విమాన సర్వీసులు ప్రతిరోజూ నడుపనున్నట్లు ఇండిగో ప్రకటించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!