సౌదీ ఎయిర్ పోర్ట్స్, ఓడరేవులలో డ్యూటీ ఫ్రీ మార్కెట్లు
- September 07, 2022
సౌదీ: అల్-సలామ్ ప్యాలెస్‌లో మంగళవారం మధ్యాహ్నం రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సౌదీలోని ఎయిర్ పోర్ట్స్, ఓడరేవులు, ల్యాండ్ పోర్ట్‌లలో డ్యూటీ ఫ్రీ మార్కెట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనితోపాటు ద్వైపాక్షిక సంబంధాలు, వాటిని వివిధ రంగాలలో అభివృద్ధి చేసే మార్గాల గురించి చైనా అధ్యక్షుడి నుండి తనకు వచ్చిన లేఖలోని విషయాలను కేబినెట్‌కు కింగ్ సల్మాన్ వివరించారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ఆవిష్కరణల వృద్ధిని వేగవంతం చేయడంలో సౌదీ అరేబియా తన ప్రయత్నాలను ముమ్మురం చేసిందని సల్మాన్ వివరించారు. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన G20 మంత్రివర్గ సమావేశాలలో పాల్గొనడంపై కేబినెట్ చర్చించిందని షౌరా కౌన్సిల్ వ్యవహారాల కేబినెట్ సభ్యుడు మీడియా తాత్కాలిక మంత్రి డాక్టర్ ఎస్సామ్ బిన్ సాద్ బిన్ సయీద్ తెలిపారు. ఇరాక్‌లో భద్రత, స్థిరత్వానికి హామీ ఇచ్చే ప్రతిదానికీ సౌదీ మద్దతునిస్తుందన్నారు.
తాజా వార్తలు
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!
- బీచ్‌లో స్టంట్స్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీలో ఇల్లీగల్ ప్రయాణీకుల రవాణాపై కఠిన చర్యలు..!!
- పిల్లిని చంపిన వ్యక్తి వీడియో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం..!!
- ఇండియన్ క్లబ్ ‘ఆవాణి’ ఓనం ఫియస్టా..!!
- కువైట్ లో ఉత్సాహంగా వికసిత్ భారత్ రన్ ..!!
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..