లైసెన్స్ లేకుండా వైద్యం చేస్తున్న వ్యక్తి అరెస్ట్
- September 08, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో ఓ వ్యక్తి డాక్టర్ చదవుకుండానే వైద్యం చేస్తుండటంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సరైన అర్హత, లైసెన్స్ లేకుండా ఈ వ్యక్తి పలువురు పేషెంట్లకు వైద్యం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా పలు వ్యాధులను నయం చేస్తానంటూ వీడియోలు షేర్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో పదుల సంఖ్యలో అకౌంట్స్ క్రియేట్ చేసి వాటి ద్వారా తాను డాక్టరనంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. తను చెప్పిన వైద్య సూచనలు పాటించి ఎంతో మంది రోగాల బారి నుంచి బయటపడ్డారని కూడా వీడియోలు షేర్ చేస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియటంతో విచారణ చేపట్టి నకిలీ వైద్యున్ని అరెస్ట్ చేశారు. అతనికి అకడమిక్ క్వాలిఫికేషన్ గానీ మెడిసిన్ ప్రాక్టీస్ చేసిన ఎక్స్ పీరియన్స్ కూడా లేదని గుర్తించారు. నకిలీ వైద్యుని పై హెల్త్ కేర్ రెగ్యులేషన్ నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!