మహిళ రోగి ఫోటో తీసిన ఆసుపత్రి ఉద్యోగి తొలగింపు
- September 09, 2022
రియాద్: హెల్త్‌కేర్ ఫెసిలిటీని సందర్శించిన మహిళా పేషెంట్ ఫోటో తీసినందుకు గాను ఒక ఉద్యోగిని సర్వీస్ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. భద్రతా అధికారులు ఉద్యోగిని అరెస్టు చేశారని, తనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉద్యోగి రోగి ఫోటోని తీసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రిత్వ శాఖ ఈ చర్య తీసుకుంది. ఇలాంటి తప్పుడు పద్ధతులు, రోగుల హక్కుల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. రోగుల హక్కులు, గోప్యతను కాపాడటానికి సంబంధించిన నిబంధనలను పాటించని, మంత్రిత్వ శాఖ విధానాలకు అనుగుణంగా ఆరోగ్య సేవలను అందించడంలో విఫలమైన ఉద్యోగులను సర్వీస్ నుంచి తొలగించేందుకు వెనుకాడబోమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!