ఇంపోర్టెడ్ కంటే తాజా ఐటమ్స్‌కే డిమాండ్
- April 16, 2016
స్థానికంగా లభించే తాజా కూరగాయలు, పండ్లకు ఉన్న డిమాండ్‌తో పోల్చి చూసినప్పుడు ఇంపోర్టెడ్ కూరగాయలు, పండ్లకు తక్కువ డిమాండ్ కనిపిస్తోంది. దానికి కారణం ఇంపోర్టెడ్ ధరలు ఎక్కువగా ఉండటమే. మార్కెట్లలో 12 ఖతారీ రియాల్స్‌కి దొరికే తాజా చెర్రీ టమాటా ధర రిటైల్ స్టోర్స్‌లో 30 నుంచి 40 ఖతారీ రియాల్స్ పలుకుతోంది. లోకల్ క్యాప్సికమ్ కిలో 7 ఖతారీ రియాల్స్‌కి ఫార్మర్ మార్కెట్స్‌లో లభిస్తోంటే, ఇంపోర్టెడ్ 20 ఖతారీ రియాల్స్‌కి సూపర్ మార్కెట్లలో లభిస్తోంది. అల్ వక్రా యార్డ్, అతి తక్కువ ధరలతోనే హౌస్హోల్డ్స్ని అందిస్తోంది. తాజా టమాటాలు, ఎగ్ ప్లాంట్స్, పంప్కిన్స్, వైట్ ఆనియన్స్ ఇతర కూరగాయలతోపాటు అరుదుగా లభించే స్థానిక పౌల్ట్రీ, డక్స్, ర్యాబిట్స్ మరియు ఆర్నమెంటల్ ప్లాంట్స్ కోసం అల్ వక్రా మార్కెట్‌కి ప్రజలు వస్తుంటారని ఓ వెండర్ చెప్పారు. స్థానిక రైతులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో ఈ మార్కెట్ ఇంకా అభివృద్ధిలోకి వెళుతోంది. ప్రత్యేక పద్ధతుల్లో కూరగాయల వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా మెరుగైన దిగుబడిని రాబడ్తున్నట్లు ఎఫ్‌జి ఆగ్రో అనే యూఎస్ బేస్డ్ కంపెనీ ప్రతినిథులు వెల్లడించారు. ఈ సంస్థ 1500 కిలోల టమాటాలు మరియు 600 నుంచి 700 కిలోల కుకుంబర్‌ని పండిస్తోంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









