జిద్ధాఫ్ రెసిడెన్షియల్ ఏరియాలో అగ్నిప్రమాదం... ఇద్దరికి గాయాలు
- September 09, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ లోని జిద్ధాఫ్ రెసిడెన్షియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో మంటలు చేలరేగాయి. దీంతో చుట్టు పక్కల వారు అప్రమత్తమై అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటల వ్యవధిలోనే మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను కాపాడారు. వీరిలో ఒకరి కి స్వల్పంగా గాయాలు కావటంతో అతన్ని హాస్పిటల్ లో చేర్పించారు. ఐతే అగ్ని ప్రమాదం జరగటానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగ, మంటలు వ్యాపించటంతో తామంత భయాందోళనకు గురయ్యామని స్థానికులు చెప్పారు. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







