భారత్-జీసీసీ మధ్య కీలక ఒప్పందం
- September 11, 2022
సౌదీ అరేబియా:భారత్-గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) మధ్య కీలక ఒప్పంద కుదిరింది. ఇరు దేశాల మధ్య సంప్రదింపుల కోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇందుకు సంబంధించిన ఒప్పందం పై భారత విదేశాంగ మంత్రి జై శంకర్, జీసీసీ సెక్రటరీ జనరల్ నయాఫ్ ఫల్హా ముబారక్ అల్ హజ్రఫ్ సంతకం చేశారు. గల్ఫ్ దేశాల సంబంధాల బలోపేతం కోసం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మూడు రోజులు పాటు సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఒప్పంద కుదిరింది. గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్(జీసీసీ) సెక్రటరీ జనరల్ నయాఫ్ ఫల్హా ముబారక్ అల్ హజ్రఫ్ తో ఆయన భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సంప్రదింపులకు అవసరమైన వ్యవస్థ ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై చర్చించారు.ఈ సమావేశం అనంతరం భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ట్వీట్ చేస్తూ..‘‘జీసీసీ సెక్రటరీ జనరల్ డాక్టర్ నయాఫ్ ఫల్హా ముబారక్ అల్ హజ్రఫ్తో ఫలవంతమైన చర్చలు జరిగాయి. భారత్-జీసీసీ మధ్య సంప్రదింపుల కోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడంపై అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఇరు పక్షాల సంబంధాల కోణంలో ప్రస్తుత ప్రపంచ పరిణామాలపై పరస్పరం అభిప్రాయాలను తెలుసుకున్నాం ’ అని అన్నారు.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025