భారత్ కరోనా అప్డేట్
- September 12, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 5,221 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 5,975 మంది కోలుకున్నట్లు చెప్పింది. మృతుల సంఖ్య 5,28,165కి చేరిందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 47,176 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.82 శాతంగా ఉందని చెప్పింది. దేశంలో ఇప్పటివరకు 215.26 కోట్ల వ్యాక్సిన్లు వినియోగించినట్లు పేర్కొంది.
వాటిలో రెండో డోసులు 94.53 కోట్లు, బూస్టర్ డోసులు 18.34 కోట్లు ఉన్నట్లు వివరించింది. నిన్న దేశంలో 30,76,305 డోసుల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో రికవరీ రేటు 98.71 శాతం ఉన్నట్లు చెప్పింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,39,25,239కు చేరిందని వివరించింది.
వారాంతపు పాజిటివిటీ రేటు 1.72 శాతంగా ఉన్నట్లు చెప్పింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 88.95 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. నిన్న 1,84,965 కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పింది.
తాజా వార్తలు
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!