సల్మాన్ ఖాన్ హత్యకు రెక్కీ..
- September 12, 2022
ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హత్యకు రెక్కీ జరిగినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. గత కొద్దీ రోజులుగా సల్మాన్ కు చంపేందుకు ట్రై చేస్తున్నట్లు పలు లేఖలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాను హత్య చేసిన నిందితులు సల్మాన్ను చంపేందుకు ముంబాయి రెక్కీ నిర్వహించినట్లుగా పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సూచనల మేరకే సల్మాన్ హత్యకు రెక్కీ జరిగినట్లుగా ఆదివారం వెల్లడించారు.
ఈ క్రమంలో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు బెంగాల్ లోని ఇండో, నేపాల్ సరిహద్దు నుంచి నేపాల్ కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అరెస్ట్ చేశారు. సిద్ధూ మూసేవాలా హత్య అనంతరం.. సల్మాన్ ఖాన్ ను.. అతడి తండ్రిని హత్య చేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. సల్మాన్ సైతం తన భద్రతను పెంచుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..