తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా
- September 12, 2022
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. శాసనసభ, మండలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే భీ భూపతిరావు మృతికి శాసనసభ సంతాపం ప్రకటించింది. అనంతరం ఏడు సవరణ బిల్లులను సంబంధిత శాఖల మంత్రులు శాసనసభలో ప్రవేశపెట్టారు. వీటిపై మంగళవారం చర్చించనున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణల బిల్లు-పర్యవసానాలపై లఘచర్చ జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్ రంగంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ముఖ్యమంత్రి కెసిఆర్ వివరించారు. విద్యుత్ రంగంలో తెలంగాణకు జరిగిన అణ్యాయాన్ని గణాంకాలతో సహా తెలిపారు. విద్యుత్ బిల్లు వెనక్కి తీసుకోవాలని రేపు సభలో తీర్మానం చేయనున్నారు. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని రేపు తీర్మానించనున్నారు. గురుకులాల్లో భోజనం, నాణ్యతపై సమీక్షిస్తామని సీఎం తెలిపారు. శాసన మండలిలో కూడా విద్యుత్ సంస్కరణలపై సభ్యులు చర్చించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!