అక్రమంగా వీసా వ్యాపారం చేస్తున్న ఫేక్ కంపెనీలపై దాడులు
- September 13, 2022
కువైట్: అక్రమంగా వీసాలు అమ్మే వ్యాపారం చేస్తున్న కంపెనీలపై పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ డిపార్ట్ మెంట్ నజర్ పెట్టింది.
ఈ అక్రమ వ్యాపారం చేస్తున్న వారికి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రైపాక్షిక కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం జయిబ్ అల్-షూయోక్ కమర్షియల్ కాంప్లెక్స్ లో దాడులు నిర్వహించింది. ట్రేడింగ్ లైసెన్స్ లేకుండా వీసా లు అమ్మే వ్యాపారం చేస్తున్న కంపెనీలను గుర్తించింది. దాదాపు 80 సంస్థలు ట్రేడింగ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నట్లు సోదాలు తెలిసింది. ఆయా కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని ట్రేడ్ మినిస్ట్రీ తో పంచుకోనుంది. ఒకవేళ అదే అడ్రస్ తో కమర్షియల్ బిజినెస్ లైసెన్స్ లేనట్లైతే వారి లైసెన్స్ రద్దు చేస్తామని అధికారులు తెలిపారు. స్థానికంగా చాలా మంది వ్యాపారులు ట్రేడింగ్ లైసెన్స్ లేకుండా అక్రమంగా వ్యాపారాలు చేస్తున్నట్లు సమాచారం అందటంతో ఈ దాడులు చేశారు. అదే విధంగా అక్రమంగా వ్యాపారం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయన్న దానిపై వారికి అవగాహన కల్పించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!