భారీ వర్షాలతో యూఏఈ అతలాకుతలం. భద్రతా సూచనలు జారీ
- September 14, 2022
యూఏఈ: భారీ వర్షాలతో యూఏఈ అతలాకుతలం అవుతోంది. మంగళవారం అనేక ప్రాంతాలలో వడగళ్ల వానలు కురిశాయి. దుబాయ్‌లోని ముర్క్వాబ్, షార్జాలోని మ్లీహాలో మంచుతో కూడిన భారీ వర్షాలు కురవగా.. మ్లీహా-ఫిలి రహదారిలో మంచువర్షం పడింది. వీటికి సంబంధించిన దృశ్యాలను వాతావరణ శాఖ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. షార్జాలోని అల్ ఫయాహ్-ఫిలి ప్రాంతంలో వడగళ్లతో కూడిన భారీ వర్షం పడిందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) తెలిపింది. ఈ నేపథ్యంలో యూఏఈ వాతావరణ విభాగం కొన్ని ప్రాంతాలకు ఎరుపు, నారింజ, పసుపు హెచ్చరికలను జారీ చేసింది. షార్జాలోని అల్ మడమ్, బటేహ్, మ్లీహా ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అల్ ఐన్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదే సమయంలో అల్ ఐన్‌లోని స్వీహాన్‌లో అత్యధిక ఉష్ణోగ్రత 46.2 ° C నమోదైందని పేర్కొంది. దీంతో పౌరులు, నివాసితులకు పోలీసులు, మునిసిపల్ అధికారులు భద్రతా సూచనలను జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్త వహించాలని పిలుపునిచ్చారు. ఎమిరేట్‌లోని ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ బోర్డులపై ప్రదర్శించబడే మారుతున్న వేగ పరిమితులను డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు