కమ్యూనిటీ పోలీసును సత్కరించిన అంతర్గత మంత్రి
- September 16, 2022
మనామా: ఉత్తర గవర్నరేట్ పోలీసు డైరెక్టరేట్‌కు చెందిన కమ్యూనిటీ పోలీసు సిబ్బందిని పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ తారిఖ్ అల్ హసన్ సమక్షంలో అంతర్గత మంత్రి జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా సత్కరించారు. ప్రజల భద్రతను పరిరక్షించేందుకు కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని, విధి నిర్వహణలో మానవతావాదాన్ని చూపాలని పోలీసులకు ఈ సందర్భంగా అంతర్గత మంత్రి అల్ ఖలీఫా సూచించారు. మంత్రితో సత్కారం పొందిన నార్తర్న్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్‌కి చెందిన కమ్యూనిటీ పోలీసు ఫదేల్ అబ్బాస్ అలావి అల్ ఖబర్జ్.. హమద్ టౌన్‌లోని ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థిని పాఠశాలకు వెళ్లే క్రమంలో జరిగిన ప్రమాదం నుంచి కాపాడి క్షేమంగా పాఠశాలకు చేర్చాడు. ఈ సమావేశానికి హ్యూమన్ రిసోర్సెస్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ, నార్తర్న్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!







