మదీనాలో కొత్తగా బంగారం, రాగి గనుల గుర్తింపు
- September 17, 2022
సౌదీ: మదీనాలో కొత్త బంగారం, రాగి ఖనిజ గనులను కనుగొన్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. బంగారు గనులు మదీనా ప్రాంతంలోని అబా అల్-రాహా సరిహద్దుల్లో ఉన్నాయని సౌదీ జియోలాజికల్ సర్వే సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది. దీనితోపాటు అల్-మాదిక్, మదీనాలోని నాలుగు ప్రాంతాల్లో రాగి గనులను గుర్తించినట్లు తెలిపింది. అంతకుముందు సౌదీలో 5,300 ఖనిజ గనులు ఉన్నాయని సౌదీ జియాలజిస్ట్స్ కోఆపరేటివ్ అసోసియేషన్ చైర్మన్ ప్రొఫెసర్ అబ్దుల్ అజీజ్ బిన్ లాబోన్ చెప్పారు. వీటిలో వైవిధ్యమైన మెటల్, నాన్-మెటల్ శిలలు, నిర్మాణ వస్తువులు, అలంకార శిలలు, రత్నాల గనులు ఉన్నాయని ఆయన వివరించారు. తాజాగా గుర్తించిన గనులు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించి జాతీయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కొత్తగా కనుగొన్న బంగారం, రాగి గనుల ద్వారా $533 మిలియన్ల పెట్టుబడి వస్తుందని, 4,000 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏర్పాటు చేసిన విజన్ 2030 లక్ష్యాలలో మైనింగ్ ఒకటని, మైనింగ్ రంగంలోకి $32 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించే ప్రణాళికలను రూపొందించినట్లు సౌదీ అరేబియా పరిశ్రమ, ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







