నేషనల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 27, 28 న స్కూల్స్ కు సెలవులు

- September 18, 2022 , by Maagulf
నేషనల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 27, 28 న స్కూల్స్ కు సెలవులు

కువైట్: ఈ నెల 29 న నేషనల్ అసెంబ్లీకి కువైట్ ఎలక్షన్స్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కోసం ప్రభుత్వం స్కూల్స్ ను ఉపయోగించుకుంటుంది. ఐతే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పనులు నిర్వహించేందుకు ఈ నెల 27, 28 న స్కూల్స్ కు సెలవు ప్రకటిస్తున్నట్లు కువైట్ విద్యాశాఖ తెలిపింది. ఎన్నికల కారణంగా రెండు రోజుల పాటు బడులు బంద్ ఉంటాయన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులకు తల్లితండ్రులు గమనించాలని కోరారు. అటు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com