షార్జా రాజుతో క్యాథలిక్ చర్చి బిషప్ సహా ఆయన బృందం సమావేశం
- September 18, 2022
షార్జా: షార్జా రాజు హిస్ హైనెస్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమిని క్యాథలిక్ చర్చి బిషప్ తో పాటు వారి బృందం కలిసింది. శనివారం అల్ బదీ ప్యాలెస్లో షార్జా రాజుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవలే క్యాథలిక్ చర్చి బిషప్ గా పాలో మారినెల్లి బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో కొత్త బిషప్ తో పాటు అంతకుముందున్న బిషప్ పాల్ హెండర్, చర్చికి సంబంధించిన అధికారులు షార్జా రాజును కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై షార్జా రాజు వారితో చర్చలు జరిపారు. ఇతర మతాలను గౌరవించటంతో పాటు పరమత సహనాన్ని ప్రతి ఒక్కరూ అలవార్చుకోవాల్సిన అవసరముందన్నారు. అదే విధంగా కొత్త బిషప్ తన విధులు నిర్వహించటంలో విజయం సాధించాలని రాజు ఆకాంక్షించారు. అటు షార్జా రాజు తమకు అందిస్తున్న సహకారం మరవలేనిదని ఆయనకు రుణపడి ఉంటామని క్యాథలిక్ చర్చి బిషప్ అన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







