ట్రాఫిక్ ప్రమాదం తర్వాత వాహనాన్ని ఆపడానికి విఫలమైతే 20,000 దిర్హామ్‌ల జరిమానా

- September 18, 2022 , by Maagulf
ట్రాఫిక్ ప్రమాదం తర్వాత వాహనాన్ని ఆపడానికి విఫలమైతే 20,000 దిర్హామ్‌ల జరిమానా

యూఏఈ: యూఏఈలో ట్రాఫిక్ రూల్స్ ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ట్రాఫిక్ నిబంధనలు బ్రేక్ చేస్తే మాత్రం అంతే సంగతులు.భారీ జరిమానాలు, కొన్ని సందర్భాల్లో జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది.ఇక ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విధానాలను అనుసరించే యూఏఈ ట్రాఫిక్ పోలీస్ విభాగం తాజాగా మరో కొత్త ప్రపొజల్‌ను అమలు చేసే విషయమై పబ్లిక్ ప్రాసిక్యూషన్‌‌ను సంప్రదించింది.ఎవరైనా వాహనదారులు యాక్సిడెంట్ చేసిన తర్వాత ప్రమాదస్థలి నుంచి తప్పించుకుంటే.. అది కూడా బాధితులకు తీవ్ర గాయాలైన సందర్భంలో. 

దీంతో ఇక పై ఇలాంటి సందర్భాల్లో వాహనదారుడికి 20వేల దిర్హాములు వరకు జరిమానా విధించవచ్చని ప్రాసిక్యూషన్ పేర్కొంది.ఈ మేరకు తాజాగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. "ప్రమాదానికి కాణమైన వాహనదారుడు.. బాధితులకు గాయాలైన సందర్భంలో పట్టించుకోకుండా ప్రమాదస్థలి నుంచి తప్పించుకుంటే 20వేల దిర్హామ్ల జరిమానా ఉంటుంది. అలాగే ప్రమాద తీవ్రతను బట్టి వాహనదారుడు జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది" అని హెచ్చరించింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన 1995లో తీసుకొచ్చిన ఫెడరల్ చట్టం నం. 21లోని ఆర్టికల్-49లో గల క్లాజ్-5 ప్రకారం ఈ జరిమానా విధించడం జరుగుతుందని ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com