చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 27 మంది మృతి..
- September 18, 2022
చైనా: నైరుతి చైనాలో ఆదివారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 27 మంది మరణించారు. మరో 20 మంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. బస్సు ప్రమాద సమయంలో 47 మంది ప్రయాణికులు ఉన్నారు.
27 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ దేశంలో ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇదే అత్యంత ఘోరమైనది. ఆదివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగిందని, ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం రావటంతో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
చైనాలోని గ్వీఝౌ ప్రావిన్స్‌లోని సందూ కౌంటీలో ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి పల్టీలు కొట్టుకుంటూ రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రాంతం మారుమూల పర్వతప్రాంతం. ఇక్కడ పలుసార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది జూన్‌లో గ్వీఝౌ ప్రావిన్స్‌లో హైస్పీడ్ రైలు పట్టాలు తప్పడంతో డ్రైవర్ మరణించాడు. ఇదిలాఉంటే ప్రస్తుతం బస్సు ప్రమాదం ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







