కువైట్‌లో నైపుణ్యం లేని కార్మికుల తగ్గింపు..!

- September 20, 2022 , by Maagulf
కువైట్‌లో నైపుణ్యం లేని కార్మికుల తగ్గింపు..!

కువైట్: నైపుణ్యం లేని కార్మికుల సంఖ్యను తగ్గించడం, ప్రైవేట్ -ప్రభుత్వ రంగాల మధ్య మరింత సమన్వయాన్ని సాధించేందుకు వీలుగా పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ (PAM), డెమోగ్రాఫిక్ కమీషన్‌లను ఒకే సంస్థగా చేర్చాలని కువైట్ ప్రభుత్వం భావిస్తోంది. రెండింటి లక్ష్యాలు ఒకటే కావడంతో ఈ చర్యను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సంస్థలు కూడా ఒకే మంత్రి పర్యవేక్షణలో ఉండనున్నాయి. దీంతో రెండు సంస్థల పనితీరు మెరుగుపడుతుందని, జనాభా అసమతుల్యతను పరిష్కరించే ఫ్రేమ్‌వర్క్‌ రూపకల్పనకు కంపెనీలు, సంస్థల పరిమితులను నిర్దేశించడానికి దోహద పడుతుందని కువైట్ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com