సౌదీ జాతీయ దినోత్సవం సందర్భంగా 'అల్ ఐన్ జూ' కు ఫ్రీ ఎంట్రీ
- September 23, 2022అల్ ఐన్: సౌదీకి జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది యూఏఈ. ఆ దేశంతో ఉన్న సత్సంబంధాల కారణంగా సౌదీ జాతీయ దినోత్సవాన్ని యూఏఈ ఘనంగా సెలబ్రేట్ చేస్తోంది. ఇందులో భాగంగా అబుదాబిలో ప్రసిద్ధ “అల్ ఐన్ జూ” లో సందర్శకులను ఉచితంగా అనుమతిస్తున్నారు. 23, 24 తేదీల్లో ఈ జూ లో సందర్శకులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు జూ అధికారులు తెలిపారు. జంతువులకు ఆహారం అందించేందుకు ఎన్ క్లోజర్స్ దగ్గరి వరకు వెళ్లేందుకు అనుమతించున్నారు. అదే విధంగా అల్ ఐన్ లోని సఫారీ ప్రయాణాలపై 50 శాతం తగ్గింపు ప్రకటించారు. " సౌదీ నేషనల్ డే ను పురస్కరించుకొని “అల్ ఐన్ జూ” సందర్శకుల ఫ్రీ ఎంట్రీ కల్పించాం. అదే విధంగా పలు రైడ్స్ పై పలు ఆఫర్లు ప్రకటించాం. వీటిని సందర్శకులు పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. జూ లో గడిపే సమయాన్ని సందర్శకులు ఎంజాయ్ చేయాలన్నదే మా ఉద్దేశం" అని జూ డైరెక్టర్ జనరల్ ఘనిమ్ ముబారక్ అల్ హజేరి చెప్పారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు