సుప్రీంకోర్టులో కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారం..

- September 27, 2022 , by Maagulf
సుప్రీంకోర్టులో కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారం..

న్యూ ఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా సుప్రీంకోర్టులో జరిగే విచారణను మంగళవారం లైవ్ స్ట్రీమింగ్ చేసింది. అది కూడా ఒకేసారి మూడు కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ఆధ్వర్యంలోని బెంచ్ విచారిస్తున్న ఈడబ్ల్యూసీ కేసుతోపాటు, జస్టిస్ డీవై చంద్రచూడ్ బెంచ్ జరుపుతున్న మరో విచారణను, జస్టిస్ ఎస్‌కే కాల్ బెంచ్ జరుపుతున్న మరో విచారణను సుప్రీంకోర్టు లైవ్ స్ట్రీమింగ్ చేసింది. ప్రస్తుతానికి యూట్యూబ్ ద్వారా మాత్రమే లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. త్వరలోనే సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రత్యేక మీడియా ద్వారా కేసు విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేస్తారు. ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనం జరిపే విచారణలను మాత్రమే ప్రసారం చేస్తారు. తర్వాత మిగతా ధర్మాసనాలు జరిపే కేసుల్ని కూడా లైవ్ స్ట్రీమింగ్ చేస్తారు. దీనికి సంబంధించిన నిర్ణయం 2018లోనే తీసుకున్నారు.

కానీ, అప్పట్నుంచి ఆచరణలోకి రాలేదు. గత నెలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైరైన జస్టిస్ ఎన్వీ రమణ.. తన పదవీ విరమణ రోజు (ఆగష్టు 26)న లైవ్ స్ట్రీమింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. దేశంలో సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం కావడం ఇదే మొదటిసారి. దీని ద్వారా కోర్టులో జరిగే విచారణల గురించి ప్రజలకు అవగాహన ఏర్పడుతుంది. కాగా, కోర్టు విచారణలు ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా జరుగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com