యూఏఈలో మోటారు బీమా క్లెయిమ్‌ల కోసం కొత్త డిజిటల్ ప్లాట్‌ఫారమ్

- September 27, 2022 , by Maagulf
యూఏఈలో మోటారు బీమా క్లెయిమ్‌ల కోసం కొత్త డిజిటల్ ప్లాట్‌ఫారమ్

యూఏఈ: మోటారు బీమా క్లెయిమ్‌లు మరింత వేగవంతంగా పరిష్కరించేందుకు యూఏఈలో కొత్త డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అందుబాటులోకి వచ్చింది. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో పనిచేయనున్న ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అబుధాబిలో రూపొందించారు. ఆటోమోటివ్ ఆఫ్టర్‌సేల్స్ పరిశ్రమలో డిజిటల్, హార్డ్‌వేర్,  మ్యాన్‌పవర్ సొల్యూషన్‌ల గ్లోబల్ ప్రొవైడర్ అయిన XA గ్రూప్ దీన్ని తయారు చేసింది. మంగళవారం ఈ అప్లికేషన్ ను అధికారికంగా లాంఛ్ చేశారు. అబుధాబి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఎమిరేట్స్ ఇన్సూరెన్స్ కంపెనీ, యాస్ తకాఫుల్ , ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీతో సహా ప్రముఖ UAE బీమా సంస్థలు ఈ కొత్త డిజిటల్ అప్లికేషన్ ను వినియోగించనున్నట్లు XA గ్రూప్‌లోని MENA ఇన్సూరెన్స్ బిజినెస్ డైరెక్టర్ మినా సాహిబ్ తెలిపారు. మోటారు రికవరీ క్లెయిమ్‌ల సమయంలో జరిగే విస్తృతమైన ప్రక్రియలను ఇది మరింత వేగంగా పూర్తి చేస్తుందన్నారు. బీమాదారుల మధ్య పాలసీ డేటా, డాక్యుమెంటేషన్ ప్రక్రియలను కొత్త అప్లికేషన్ తో సులువుగా పూర్తవుతుందన్నారు. ముఖ్యంగా థర్డ్-పార్టీ క్లెయిమ్‌ల సమయంలో బీమా సంస్థ మరొక కంపెనీ నుండి నిధులను రికవరీ చేయవలసి వచ్చినప్పుడు, ఆ కమ్యూనికేషన్ అంతా డిజిటల్‌గా జరిగేలా చేస్తుందన్నారు. కొత్త డిజిటల్ ప్లాట్‌ఫారమ్ రెండు బీమా సంస్థల మధ్య జరిగే వ్యవహారాలల్లో పారదర్శకతను అందిస్తుందని ఎమిరేట్స్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పాల్ మెక్‌లియోడ్ తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com