సౌదీలో న్యాయవాదిపై సస్పెన్షన్ వేటు
- September 27, 2022
సౌదీ: ఒక కంపెనీని అవమానించినందుకు, ఆ సంస్థ పరువు తీసినందుకు ఒక న్యాయవాదిని ఒకటిన్నర సంవత్సరాల పాటు న్యాయవాద వృత్తి నుండి దూరంగా ఉండాలని న్యాయ మంత్రిత్వ శాఖలోని న్యాయవాదుల క్రమశిక్షణా కమిటీ సస్పెండ్ చేసింది. దీంతోపాటు న్యాయవాదిపై మోపబడిన అభియోగాలకు చట్టపరమైన ప్రక్రియలు తీసుకోవాలని కూడా కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. సదరు న్యాయవాది న్యాయ వ్యవస్థ, న్యాయవాదుల వృత్తిపరమైన ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించినట్లు గుర్తించినట్లు కమిటీ తెలిపింది. అలాగే న్యాయ వ్యవస్థ, దాని కార్యనిర్వాహక నిబంధనలు, న్యాయవాదుల వృత్తిపరమైన ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించిన నలుగురు న్యాయవాదులపై కమిటీ శిక్షాత్మక క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు న్యాయవాదుల క్రమశిక్షణా కమిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..