ఒక్కో పాఠశాల అవసరాలకు 4,000 దీనార్లు: కువైట్ విద్యాశాఖ

- September 27, 2022 , by Maagulf
ఒక్కో పాఠశాల అవసరాలకు 4,000 దీనార్లు: కువైట్ విద్యాశాఖ

కువైట్: కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి బ్యాచ్ స్కూల్ ఫండ్ విడుదలైందని,  సంబంధిత ప్రభుత్వ పాఠశాలల ఖాతాల్లో వాటిని జమ చేసినట్లు విద్యా మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ యూసఫ్ అల్-నజ్జర్ తెలిపారు. ఒక్కో పాఠశాల అవసరాలకు 3,500- 4,000 దీనార్ల మధ్య అందుతాయన్నారు. 75 శాతం కేటాయింపులు పూర్తి చేసినట్లు.. రెండవ దశ చెల్లింపులు (25 శాతం)లను వచ్చే ఏప్రిల్‌లో పంపిణీ చేయనున్నట్లు అల్-నజ్జర్ వివరించారు. ఈ ఫండ్ పాఠశాల హెడ్ మాస్టర్ ఆధీనంలో ఉంటందన్నారు. ఈ నిధులను స్టేషనరీ, కార్యాలయ సామాగ్రి, వాటర్ ట్యాంక్‌లు కడగడం, మరుగుదొడ్లు మరమ్మతులు, చిన్నపాటి నిర్వహణ పనులకు ఖర్చు చేయొచ్చన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com