‘గాడ్ ఫాదర్’ కోసం ‘ఐటెమ్’ రెడీ.! ప్రూఫ్ ఇదిగో.!
- September 27, 2022మెగాస్టార్ చిరంజీవి హీరోగా 154వ చిత్రంగా రూపొందుతోన్న ‘గాడ్ ఫాదర్’ సినిమాకి ఒరిజినల్‌తో సంబంధం లేకుండా తెలుగు నేటివిటీ కోసం అద్దాల్సిన అన్ని హంగులూ అద్ధేశారని తెలుస్తోంది.
ఇటీవలే ‘తార్ మార్ టక్కర్ మార్..’ అంటూ ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో చిరుతో కలిసి, సల్మాన్ ఖాన్ సైతం సింపుల్ అండ్ మాస్ స్టెప్పులేస్తూ ఇటు చిరు అభిమానులకీ, అటు సల్మాన్ అభిమానులకీ విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారన్న హింట్ లీక్ చేశారు.
ఇక ఇప్పుడు ఈ సినిమాకి మరో అదనపు ఆకర్షణ అద్దినట్టు తెలుస్తోంది. సీరియస్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతోన్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఓ స్పెషల్ ఐటెమ్ సాంగ్‌ని ఇరికించారట. ఈ ఐటెం సాంగ్‌లో వారినా హుస్సేన్ అను ఐటెమ్ భామ హాట్ స్టెప్పులతో అలరించనుంది.
ఇటీవల రిలీజై హిట్ అయిన ‘బింబిసార’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది ఈ ముద్దుగుమ్మ వారినా హుస్సేన్. ఇప్పుడు చిరుతో కలిసి ‘గాడ్ ఫాదర్’ కోసం మరోసారి ఐటెమ్ అవతారమెత్తింది. అయితే, ఈ సాంగ్‌లో అమ్మడికి చిరుతో కలిసి స్టెప్పులేసే అవకాశం దక్కలేదట.
ఈ పాటలో చిరంజీవి భాగం అవుతారు కానీ, ఐటెం గాళ్‌తో కలిసి స్టెప్పులేసే అవకాశం లేదట. ఏది ఏమైతేనేం, చిరంజీవి ఎదురుగా డాన్స్ చేసే చాన్స్ అయితే దక్కించేసుకుందీ హాట్ హాట్ అందాల భామ వారినా హుస్సేన్.
తాజా వార్తలు
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్