‘గాడ్ ఫాదర్’ కోసం ‘ఐటెమ్’ రెడీ.! ప్రూఫ్ ఇదిగో.!
- September 27, 2022
మెగాస్టార్ చిరంజీవి హీరోగా 154వ చిత్రంగా రూపొందుతోన్న ‘గాడ్ ఫాదర్’ సినిమాకి ఒరిజినల్‌తో సంబంధం లేకుండా తెలుగు నేటివిటీ కోసం అద్దాల్సిన అన్ని హంగులూ అద్ధేశారని తెలుస్తోంది.
ఇటీవలే ‘తార్ మార్ టక్కర్ మార్..’ అంటూ ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో చిరుతో కలిసి, సల్మాన్ ఖాన్ సైతం సింపుల్ అండ్ మాస్ స్టెప్పులేస్తూ ఇటు చిరు అభిమానులకీ, అటు సల్మాన్ అభిమానులకీ విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారన్న హింట్ లీక్ చేశారు.
ఇక ఇప్పుడు ఈ సినిమాకి మరో అదనపు ఆకర్షణ అద్దినట్టు తెలుస్తోంది. సీరియస్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతోన్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఓ స్పెషల్ ఐటెమ్ సాంగ్‌ని ఇరికించారట. ఈ ఐటెం సాంగ్‌లో వారినా హుస్సేన్ అను ఐటెమ్ భామ హాట్ స్టెప్పులతో అలరించనుంది.
ఇటీవల రిలీజై హిట్ అయిన ‘బింబిసార’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది ఈ ముద్దుగుమ్మ వారినా హుస్సేన్. ఇప్పుడు చిరుతో కలిసి ‘గాడ్ ఫాదర్’ కోసం మరోసారి ఐటెమ్ అవతారమెత్తింది. అయితే, ఈ సాంగ్‌లో అమ్మడికి చిరుతో కలిసి స్టెప్పులేసే అవకాశం దక్కలేదట.
ఈ పాటలో చిరంజీవి భాగం అవుతారు కానీ, ఐటెం గాళ్‌తో కలిసి స్టెప్పులేసే అవకాశం లేదట. ఏది ఏమైతేనేం, చిరంజీవి ఎదురుగా డాన్స్ చేసే చాన్స్ అయితే దక్కించేసుకుందీ హాట్ హాట్ అందాల భామ వారినా హుస్సేన్.
తాజా వార్తలు
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్