ఆదిపురుష్: అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రబాస్.!
- September 28, 2022యూనివర్సల్ స్టార్ ప్రబాస్, వరుసగా తాను ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇంతవరకూ ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా పూర్తి చేసుకుంటూ వచ్చిన ప్రబాస్, ఈ సారి సమాంతరంగా చేయాల్సిన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసేస్తున్నాడు.
అందులో భాగంగా ఓ పక్క ‘సలార్’ షూటింగ్లో పాల్గొంటూనే, ఇంకో పక్క ‘ఆది పురుష్’నీ పూర్తి చేసేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా వున్న ఈ సినిమాకి సంబందించి ఓ తాజా అప్డేట్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
బాలీవుడ్ ఫిలిం మేకర్ ఔం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్నీ, టీజర్నీ త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు మేకర్లు.
అక్టోబర్ 2న అయోధ్యలోని ఐమాక్స్ ధియేటర్లో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది.
రామాయణం బ్యాక్ డ్రాప్లో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రబాస్ రాముడి పాత్ర పోషిస్తుండగా ముద్దుగుమ్మ కృతి సనన్ సీత పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దించనున్నారు. జనవరి 12, 2023లో ‘ఆది పురుష్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..