అప్పుడు ‘సుల్తాన్’.! ఇప్పుడు ‘జపాన్’.! కార్తీతో రష్మిక ఈ సారైనా వర్కవుట్ అవుతుందా.?
- September 28, 2022నేషనల్ క్రష్ రష్మికా మండన్నా తెలుగులో స్టార్ హీరోయిన్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుతో పాటూ, తమిళ, హిందీ సినిమాలనూ కలిపి చుట్టేస్తోందిప్పుడు.
గతంలో కార్తి హీరోగా వచ్చిన ‘సుల్తాన్’ సినిమాతో రష్మిక తొలిసారి తమిళ తంబీల్ని పలకరించింది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఆ సినిమా అనుకోకుండా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు కార్తితో ఇంకోసారి స్ర్కీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధమవుతోందట రష్మికా మండన్నా.
కార్తి హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో రష్మికా మండన్నాని హీరోయిన్గా ఎంచుకునేందుకు మంతనాలు జరుగుతున్నాయట. ఆల్ సెట్ అని తెలుస్తోంది. ఈ సినిమాకి ‘జపాన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు కోలీవుడ్ సమాచారం.
మరి ఈసారైనా రష్మికకు కార్తీతో వర్కవుట్ అవుతుందా.? చూడాలిక. ఇదిలా వుంటే, రష్మిక నటించిన బాలీవుడ్ చిత్రం ‘గుడ్ బై’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. అలాగే, ‘యానిమల్’ ‘మిషన్ మజ్న’ సినిమాలు కూడా త్వరలో రిలీజ్‌కి రెడీగా వున్నాయ్. అన్నట్లు తమిళంలో విజయ్‌తో రష్మిక ‘వారసుడు’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల