షార్జాలో మేఘాలను తాకిన దుమ్ము, ధూళి సుడిగుండం
- September 30, 2022షార్జా: యూఏఈ లోని షార్జాలో వాతావారణ పరంగా వింత సంఘటన చోటు చేసుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా దుమ్ము, దూళి సుడిగుండం అత్యంత పైకి లేస్తూ మేఘాలను తాకింది. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అరుదుగా కనిపించే దృశ్యం కావటంతో చాలా మంది మొబైల్ లో ఈ సంఘటనను వీడియో తీశారు. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) ఈ వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేసింది. ఒక గరాటు ఆకారంలో దుమ్ము, దూళి మేఘాలను తాకుతున్న దృశ్యం ఆ వీడియోలు స్పష్టంగా కనిపిస్తోంది. షార్జాలో ఎన్నో ఇసుక, దూళి తుపానులు వచ్చినప్పటికీ ఇలాంటి సంఘటన మాత్రం అరుదేనని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. గత పదిరోజుల్లోనే ఇలాంటి ఘటన రెండోసారి జరగటం విశేషం. అటు అల్ బడాయర్లో మంచుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని...హఠాత్తుగా కొండచరియలు విరిగిపడవచ్చని వాతావారణ అధికారులు హెచ్చరించారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..