పబ్లిక్ ప్లేస్ లో గొడవ. ముగ్గురు మహిళలతో పాటు ఆరుగురు అరెస్ట్

- September 30, 2022 , by Maagulf
పబ్లిక్ ప్లేస్ లో గొడవ. ముగ్గురు మహిళలతో పాటు ఆరుగురు అరెస్ట్

రియాద్: రియాద్ లోని ధుర్మా గవర్నరేట్ పరిధిలో ఘర్షణకు పాల్పడిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పబ్లిక్ ప్లేస్ లో వీరు గొడవకు దిగటంతో జనం ఇబ్బందులు పడ్డారు. సీసీటీవీ కెమెరా ద్వారా నిందితులను గుర్తించారు. పాత గొడవల కారణంగానే వీరు గొడవ పడ్డట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్నాప్ చాట్ ద్వారా పోలీసులు షేర్ చేశారు. "ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించిన ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశాం. ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు." అని పోలీసులు ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com