జిటెక్స్ గ్లోబల్ 2022 లో ఫ్లైయింగ్ కారు ప్రదర్శన
- September 30, 2022
దుబాయ్: వచ్చే నెలలో దుబాయ్లో జరగనున్న జిటెక్స్ గ్లోబల్-2022 లో ఫ్లైయింగ్ కారును ప్రదర్శించనున్నారు.ప్రముఖ టెక్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ జి పెంగ్ (Xpeng) ఈ కారును తయారు చేసింది. ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ , ల్యాండింగ్ ఇది ప్రత్యేకత. ఫ్లయింగ్ కార్ - X2 గా దీనికి పేరు పెట్టారు.దుబాయ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో జి పెంగ్ దీన్ని తయారు చేసింది. పబ్లిక్ రవాణాకు సంబంధించి ఇది భవిష్యత్ లో అద్భుతం సృష్టిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇందులో టూ-సీటర్ తో పాటు ఇంటెలిజెంట్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. తక్కువ దూరంలో ఉండే నగరాలు, ఎమర్జెన్సీ హెల్త్ కండిషన్ లో ఉన్నప్పుడు ఈ కారు ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు. జిటెక్స్ గ్లోబల్ 2022 ప్రదర్శన అక్టోబర్ 10 నుంచి 14 వరకు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC)లో జరుగుతుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్ పో కు 170 దేశాల నుంచి లక్ష మంది హాజరవుతారని అంచనా.
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్