ఏవండోయ్ నానిగారూ.! మేకోవర్ మరీ ఇంతలానా?

- October 01, 2022 , by Maagulf
ఏవండోయ్ నానిగారూ.! మేకోవర్ మరీ ఇంతలానా?

హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. ఎందుకంటారా.? ‘దసరా’ అనే సినిమాలో నాని నటిస్తున్నసంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం నాని డిఫరెంట్ మేకోవర్ ప్రదర్శిస్తున్నాడు. 
అక్టోబర్ 3న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందన్న అనౌన్స్‌మెంట్ సందర్భంగా, ‘దసరా’ చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో నానిని అభిమానులు కూడా గుర్తు పట్టలేకపోతున్నారు. అంతలా మేకోవర్ అయిపోయాడు.
మేకోవర్ విషయంలో ఈ మధ్య హీరోలు అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. చరణ్, అల్లు అర్జున్ తదితర హీరోలు ఈ మధ్య షాకింగ్ లుక్స్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే, నాని మాత్రం ఇంతవరకూ అలాంటి సాహసం చేయలేదు. 
కానీ, ఈ సారి నానికి కూడా మేకోవర్ తప్పినట్లు లేదు. ‘దసరా’ మూవీ కోసం మాసిన గెడ్డం. పెరిగిన జుట్టు.. మాస్, పక్కా ఊర మాస్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు నాని. ఈ లుక్‌లో నానిని చూడడం కాస్త కష్టంగానే అనిపిస్తోంది ఇప్పటికయితే.
కానీ, సినిమా కథా, కథనాల ప్రకారం నాని ఈ లుక్స్‌ని మ్యాచ్ చేసేస్తాడేమో చూడాలి మరి. రీసెంట్‌గా ‘శ్యామ్ సింఘరాయ్’, ‘అంటే సుందరానికి..’ వంటి ఫ్యామిలీ మూవీస్‌తో ఆకట్టుకున్న నాని, ఈ మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌తో ఎలాంటి మ్యాజిక్ చేయనున్నాడో చూడాలిక.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com