దుబాయ్ పోలీస్ పెట్రోలింగ్ లో చేరిన తొలి ఎలక్ట్రిక్ కార్

- October 01, 2022 , by Maagulf
దుబాయ్ పోలీస్ పెట్రోలింగ్ లో చేరిన తొలి ఎలక్ట్రిక్ కార్

దుబాయ్: దుబాయ్ పోలీసుల లగ్జరీ పెట్రోలింగ్ కార్లలో తొలి ఎలక్ట్రిక్ Hongqi E-HS9, ONEROAD సూపర్‌కార్‌ చేరింది. దీన్ని ఆటోమోటివ్ కంపెనీ తయారు చేసింది. దుబాయ్ పోలీసులు ఎమిరేట్ భద్రతకు, ప్రపంచంలోని సురక్షితమైన గమ్యస్థానాలలో ఒకటిగా తన స్థానాన్ని కొనసాగించడానికి పోలీసులు ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటారని నేర పరిశోధన వ్యవహారాల అసిస్టెంట్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీం అల్ మన్సూరి ఈ సంధర్భంగా తెలిపారు. విలాసవంతమైన పెట్రోలింగ్ వాహనాలతో బుర్జ్ ఖలీఫా, షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ బౌలేవార్డ్, జెబిఆర్ మొదలైన ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలలో భద్రత మరింత పెరుగుతుందన్నారు. 
వాహన ప్రత్యేకతలు 
Hongqi E-HS9 అనేది SUV కార్యాచరణతో Hongqi బ్రాండ్ మొదటి పూర్తిస్థాయి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం. E-HS9 5.0 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకోగలదు. దాదాపు 6 నుండి 8 గంటల్లో బ్యాటరీని 0-100 శాతం నుండి ఛార్జ్ చేయవచ్చు. E-HS9 ఎలక్ట్రిక్ వాహనం ఛార్జ్‌పై దాదాపు 440కిమీ ప్రయాణించగలదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com