దుబాయ్ లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

- October 02, 2022 , by Maagulf
దుబాయ్ లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

దుబాయ్: దుబాయ్ లో సింగిరి & కో ఆడిట్ ఫర్మ్ లో జాతిపిత,ప్రపంచ శాంతి కమకులు  మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ప్రవాసాంధ్రులు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గాంధీ పుట్టిన దేశంలో మనం పుట్టడం ప్రపంచం గర్వించదగ్గ విషయమని.ప్రపంచ దేశాలకు సంగతి మార్గాన్ని చూపిన మహనీయుని పుట్టినరోజు దుబాయ్ లో జరుపుకోవడం భారతీయులుగా గర్వించ దగ్గ విషయమని,కుల మత వర్గ రహితంగా స్వాతంత్ర్యం వైపునకు పరుగులు పెట్టించిన గొప్ప మానవతావాది అని, అయన ప్రతిమాట, ప్రతి అడుగు ఆచరణీయం అని చెప్పారు.దుబాయ్ లో మొదట సారి మహాత్ముని పుట్టినరోజు చేయడం గొప్ప విషయమని నిర్వాహకులు తెలిపారు.అనంతరం మహాత్మా గాంధీ జన్మదిన కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రవాసీయులు డాక్టర్ ముక్కు తులసి కుమార్,సింగిరి రవి కుమార్,కసారం రమేష్,గరగపర్తి రాంకీ, తడివాక రమేష్ నాయుడు,సురేష్ గంధం,కోడి రవికిరణ్,గోపి బర్మా తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com