‘గాడ్ పాదర్’పై ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసిన మోహన్ రాజా.!
- October 04, 2022
మలయాళ మూవీ ‘లూసిఫర్’కి రీమేక్‌గా రూపొందుతోన్న సినిమా ‘గాడ్ ఫాదర్’. తెలుగు నేటివిటీ కోసం ఈ సినిమాలో చాలా చాలా మార్పులు చేశామని డైరెక్టర్ మోహన్ రాజా చెబుతున్నారు.
అయితే, ప్రస్తుతం ‘లూసిఫర్’ తెలుగు వెర్షన్ ఓటీటీలో అందుబాటులో వుంది. చిరంజీవి రీమేక్ చేస్తున్న సినిమా కావడంతో, ‘లూసిఫర్’ తెలుగు వెర్షన్‌ని కాస్త శ్రద్ధగానే ఆడియన్స్ వీక్షించేశారు. సీన్ టు సీన్ సినిమాని అబ్జర్వ్ చేశారు.
అయితే, తెలుగు రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నాకా, ఒరిజినల్ కంటెంట్ తెలుగు వెర్షన్ అందుబాటులో వుండడం ఎంతవరకూ సబబు.? అది రేపు రిలీజ్ కాబోయే ‘గాడ్ ఫాదర్’ మూవీపై ఇంపాక్ట్ క్రియేట్ చేయదా.? అంటే, అందుకూ డైరెక్టర్ మోహన్ రాజా దగ్గర కన్విన్సింగ్ సమాధానాలుండడం విశేషం.
మలయాళ సినిమా స్ర్కీన్ ప్లే కాస్త స్లోగా నడుస్తుంటుంది. హీరో మోహన్ లాల్ పాత్ర కేవలం 50 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. కానీ, ‘గాడ్ ఫాదర్’ స్ర్కీన్‌ప్లే పరుగులు పెట్టిస్తుంది. సినిమా మొత్తం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కనిపిస్తారు. ఒరిజినల్ వెర్షన్‌కి సంబంధించి కేవలం క్యారెక్టర్లు మాత్రమే తీసుకున్నాం తప్ప, క్యారెక్టర్ డిజైన్లు పూర్తిగా మార్చేశామని డైరెక్టర్ చెప్పారు.
‘గాడ్ ఫాదర్’పై ఆసక్తి పెంచేలా డైరెక్టర్ మాటలున్నాయ్. అయినా నిజమే, తెలుగు ఆడియన్స్ సంతృప్తి చెందాలంటే, మెగాస్టార్ చిరంజీవిని ఓ రేంజ్లో ఎలివేట్ చేస్తూ చూపించాలి. అసలే అక్కడున్నది ‘రీమేక్ రాజా’ మోహన్ రాజా. ఇప్పటికే ట్రైలర్లో చిరంజీవి అప్పియరెన్స్, చెబుతున్న డైలాగులు ఫ్యాన్స్‌ని పిచ్చెక్కించేస్తున్నాయ్. మాటల్లోని ఆసక్తి, సినిమాలో ఎంత మేర చూపించారో డైరెక్టర్ తెలియాలంటే, మరికొన్ని గంటలు మాత్రమే వెయిట్ చేయాల్సింది. విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 5న ‘గాడ్ ఫాదర్’ గ్రాండ్‌గా ధియేటర్లలో సందడి చేయనుంది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







