‘మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్’ను ప్రారంభించిన ఖతార్
- October 06, 2022
ఖతార్: ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచ కప్ 2022కు ముందు.. 18 నెలల పునర్నిర్మాణం తర్వాత ఇస్లామిక్ ఆర్ట్ మ్యూజియంను ఖతార్ ఆవిష్కరించింది. ఈ మ్యూజియంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 14 శతాబ్దాల ఇస్లామిక్ కళ, కళాఖండాలను ప్రదర్శిస్తారు. దోహా వాటర్‌ఫ్రంట్ ప్రొమెనేడ్‌లో నిర్మించిన ఈ భవనం 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ వాస్తుశిల్పుల్లో ఒకరైన దివంగత యూఎస్ ఆర్కిటెక్ట్ ఐఎంపీ మార్గదర్శకత్వంలో నిర్మించారు. అరబ్ దేశంలో నవంబర్ 20న ప్రారంభమయ్యే మొదటి ఫుట్‌బాల్ ప్రపంచ కప్ కోసం ఖతార్ కొత్త స్టేడియంల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చించింది. ఈ సందర్భంగా ఖతార్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు వీలుగా డజన్ల కొద్దీ ప్రజా కళాఖండాలను నిర్మించింది. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం ప్రారంభంలో ఖతార్ ఒలింపిక్, స్పోర్ట్స్ మ్యూజియాన్ని ఖతార్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు







