ప్రవక్త జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ అధ్యక్షుడు

- October 07, 2022 , by Maagulf
ప్రవక్త జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ అధ్యక్షుడు

యూఏఈ: మొహమ్మద్ ప్రవక్త (స) పుట్టినరోజు సందర్భంగా పౌరులు, నివాసితులకు యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుభాకాంక్షలు తెలిపారు. "ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా అతని ఉదాత్తమైన పాత్ర, అతని కాలాతీత విలువలు, మానవాళి అందరికీ దయ, స్నేహం, సానుభూతిని స్ఫూర్తిదాయకమైన వారసత్వం ద్వారా మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాము." అని షేక్ మొహమ్మద్  ట్వీట్ చేశారు. ప్రవక్త పుట్టినరోజు ప్రతి సంవత్సరం హిజ్రీ సంవత్సరంలో మూడవ నెల అయిన రబీ అల్ అవల్ 12 వ తేదీన వస్తుంది. ఈ సంవత్సరం రబీ అల్ అవల్ 1444 12వ తేదీ (ఇంగ్లిష్ క్యాలెండర్ ప్రకారం.. 2022 అక్టోబర్ 8(శనివారం)) వచ్చింది.  అక్టోబరు 8న ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు పెయిడ్ సెలవుగా యూఏఈ ఇదివరకే ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com